World Packaging Organisation
World Packaging Organisation

హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, ప్యాకేజింగ్ & ఫార్మా రంగ దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి ఏవీపీఎస్.. World Packaging Organisation (WPO) గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా తిరిగి నియ‌మితుల‌య్యారు. WPO తొలి మ‌హిళా ప్రెసిడెంట్, బ్రెజిల్ కు చెందిన లూసియానా పెల్లెగ్రినో … ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

చ‌క్ర‌వ‌ర్తి ఎన్నో ఏళ్లుగా ప్యాకేజింగ్ & ఫార్మా రంగాల్లో విశేష‌ సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఇండో డ‌చ్ జాయింట్ వెంచ‌ర్ అయిన ఎకో బ్లిస్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా, సీఈవోగా ఉన్నారు.

World Packaging Organisation:

World Packaging Organisation
Chakravarthi AVPS Re Appointed As Global Ambassador World Packaging Organisation

ఫార్మా & ప్యాకేజింగ్ రంగాల్లో విశేష అనుభవం:

ఫార్మాస్యుటిక‌ల్ మాన్యుఫాక్చ‌రింగ్ & ప్యాకేజింగ్ విభాగంలో అపార అనుభ‌వం చ‌క్ర‌వ‌ర్తి ఏవీపీఎస్ సొంతం. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇండియా ఫార్మా ప్ర‌మోషన్ కు కృషి చేసినందుకుగానూ ప్ర‌తిష్టాత్మ‌క ఫార్మా ర‌త్న అవార్డు ఆయ‌న‌ను వ‌రించింది. ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఫార్మా ఆంట్రాప్రెన్యూర్స్ (ఎఫ్ ఓపీఈ) సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ (నేష‌న‌ల్) & ఎఫ్ ఓపీఈ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఛైర్మ‌న్ గా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.

Poultary

కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ తెలంగాణ ఫార్మా & లైఫ్ సైన్సెస్ బోర్డు స‌భ్యునిగా, స‌ల‌హాదారుగా కూడా చ‌క్ర‌వ‌ర్తి కొన‌సాగుతున్నారు. ఇవే కాకుండా ఇండో నెద‌ర్లాండ్స్ బిజినెస్ అసోసియేష‌న్ ఫ‌ర్ తెలంగాణ & ఏపీ ఛైర్మ‌న్ స‌హా ప‌లు ఇత‌ర విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

ప‌లు అంత‌ర్జాతీయ పోటీలు, అవార్డు కార్య‌క్ర‌మాల‌కు జ్యూరీ/చీఫ్ జ్యూరీగా కొన‌సాగుతున్నారు. చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప్ర‌సంగాలిచ్చారు. 25కు పైగా దేశాల్లో అనేక కార్య‌క్ర‌మాల‌కు మెంటార్ గా వ్య‌వ‌హ‌రించారు.

చ‌క్ర‌వ‌ర్తి పొందిన ప‌లు పుర‌స్కారాలు:

  • ఇండియ‌న్ ఫార్మా ఇండ‌స్ట్రీకి అందించిన సేవ‌ల‌కుగానూ యూఎంబీ పుర‌స్కారం
  • హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో భాగంగా లెజెండ‌రీ పుర‌స్కారం
  • వ‌ర‌ల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ నుంచి ప్యాకేజింగ్ లీడ‌ర్ షిప్ అవార్డ్
- పి. వంశీకృష్ణ
Bharati Cement