Dr. Boora Narsaiah Goud, Ex-MP Bhongir, Telangana & Laparoendoscopic Surgeon

0
213

Legends Exclusive Stories | Dr. Boora Narsaiah Goud, Laparoendoscopic Surgeon & Ex-MP Bhongir, Telangana

గుర్తింపు కావాలంటే అవకాశం రావాలి. అవకాశం రావాలంటే మన పట్ల మనకు ఉన్న నమ్మకం కన్నా అవతలి వారికి మనపట్ల నమ్మకం ఉండాలి. భువనగిరి నియోజకవర్గ మాజీ పార్లమెంట్ సభ్యులు అయిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, వైద్య వృత్తిలో రాణిస్తున్నప్పటికీ తాను ఎదగడమంటే తనతోటి సమాజం కూడా ఎదగాలి అనే ఆకాంక్షతో రాజకీయాలలోకి అడుగుపెట్టి తనదైన మార్గాలలో అనుకున్నది సాధిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.
వ్యవసాయం చేసుకునే మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి నాన్నగారికి చదివించడం పట్ల మక్కువ లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో ఎంతో ఇష్టంతో వైద్య విద్యను అభ్యసించారు. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు ఆ వ్యక్తికి ఉన్న పేరు ద్వారా కాకుండా ఆ వ్యక్తి సంపాదించుకునే కీర్తిని బట్టి ఉంటుందని నిరూపించారు శ్రీ నర్సయ్య గౌడ్ గారు. హైబిజ్ టివి ఎం డి శ్రీ మేడిశెట్టి రాజ్ గోపాల్ గారితో మాట్లాడుతూ, అధిక జనాభా కలిగి ఉండడమే మన దేశ పురోగతికి పెద్ద సవాలు.అని, ప్రభుత్వం కృషి చేస్తే ప్రజలందరికి విద్య, మెరుగైన వైద్యం అందించగలిగితే భారత దేశం ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది అని అన్నారు.
బి ఎల్ ఆర్ ఫౌండేషన్ ను స్థాపించి , గ్రామీణ ప్రాంతాలకు, నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విద్య , వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి జూనియర్ డాక్టర్స్ సంఘానికి అధ్యక్షత వహించి అగ్ర నాయకులను సైతం తన పట్టుదలతో మెప్పించి అందిరి మేలు కోసం ఏర్పరచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ గా మొదలుపెట్టి, సర్జన్ గా, వైద్య అధ్యాపకునిగా, ప్రజల ప్రతినిధిగా,
ఎం. ఎల్. ఏ గా , భువనిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి దాదాపు 5000 కోట్ల రూపాయల విలువైన హై వే ను సాధించి తమ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.
ఒక మొక్క చెట్టుగా ఎదిగితే వంద మందికి నీడను ఇవ్వగలుగుతుంది. అలాగే మనం సాధించాలి అనుకునే జీవన ప్రయాణంలో కలిగే అడ్డంకులను అధిగమిస్తూ అనుకున్నది సాధించాలనే పట్టుదలతో వేసే ప్రతి అడుగు మనం కోరుకునే గమ్యానికి మనల్ని చేరువ చేస్తుంది అని నిరూపించిన బూర నర్సయ్య గౌడ్ గారు నేటి మన హైబిజ్ టీవీ లెజెండ్ .
#BooraNarsaiahGoud #Bhongir #Bhuvanagiri
► Watch More Business Videos at India’s Leading online business channel http://www.hybiz.tv
► Like us on Facebook: http://www.facebook.com/hybiz
► Watch More Videos on http://www.youtube.com/hybiztv
► Subscribe to HYBIZTV Channel: goo.gl/EEXqfu
►Follow us on Twitter https://twitter.com/hybiztv