Summary Tiger Census – for state wise numbers and details of methodology

0
72

గతేడాది అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రకటించిన ‘అఖిలభారత పులుల లెక్కింపు 2018’ నాలుగో దశ.. ప్రపంచంలోనే అతి పెద్ద “కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే”గా గిన్నిస్ రికార్డు సృష్టించింది.

ఇదొక గొప్ప క్షణం, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రకాశవంతమైన అంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని ఎప్పుడు చెబుతుండే “సంకల్ప్‌ సే సిద్ధి”గా అభివర్ణించారు.

పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని చేసిన తీర్మానాన్ని, లక్ష్యానికి నాలుగేళ్ల ముందే నిలబెట్టుకున్నామని జావడేకర్‌ చెప్పారు. కొత్త లెక్కల ప్రకారం దేశంలో 2967 పులులు ఉన్నాయన్నారు. దీనితో, ప్రపంచంలో ఉన్న పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయని వివరించారు. 2022 నాటికి దేశంలో పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 2010లో తీర్మానించామని, లక్ష్యానికి  నాలుగేళ్ల ముందే దానిని సాధించామని జావడేకర్‌ చెప్పారు.

 

WhatsApp Image 2020-07-11 at 10.38.54.jpeg

“వనరు, సమాచారం పరంగా 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో దశ చాలా సమగ్రమైనది. 141 ప్రాంతాల్లోని 26,838 చోట్ల కెమెరాలు ట్రాప్‌లు (మోషన్ సెన్సార్లతో అమర్చిన కెమెరాలు, జంతువు ఆ పరికరాల ఎదుట నుంచి వెళుతున్నప్పుడు ఫొటో తీస్తాయి) అమర్చారు. 1,21337 చ.కి.మీ. (46,848 చ.మై.) విస్తీర్ణంలో సర్వే జరిగింది. కెమెరా ట్రాప్‌లు మొత్తం 3,48,58,623 ఫొటోలు (వీటిలో 76,651 పులులు, 51,777 చిరుతలు, మిగిలినవి ఇతర జంతుజాలం) తీశాయి. వీటి నుంచి 2,461 పులులను (పులికూనలు కాక) చారలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించారు.” అని గిన్నిస్‌ బుక్‌ సైట్‌లో రాశారు.

కెమెరా ట్రాప్‌ల తరహాలోనే, పాదముద్రల ద్వారా పులుల జనాభా లెక్కింపు కోసం, 2018లో “స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ ఇన్‌ ఇండియా” కార్యక్రమం చేపట్టారు. 522,996 కి.మీ. (324,975 మైళ్లు) విస్తీర్ణంలోని 317,958 పులుల నివాస ప్రాంతాల్లో చెట్లు, పేడను నమూనాల కోసం సేకరించారు. మొత్తం 381,200 కి.మీ. (147,181 చ.మై.) అటవీ ప్రాంతాన్ని అధ్యయనం చేసినట్లు; నమూనాల సేకరణ, సమాచార సమీక్ష కోసం 620,795 పనిదినాలను వెచ్చించినట్లు అంచనా వేశారు.

భారత వన్యప్రాణుల సంస్థ సాంకేతిక సాయంతో, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ యంత్రాంగం పులుల జనాభా లెక్కింపు చేపడుతుంది. రాష్ట్ర అటవీ శాఖలు, వాటి భాగస్వాములు ఈ గణన చేపడతాయి.

ప్రపంచవ్యాప్తంగా 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలు, మన దేశంలో చేపట్టిన “ప్రాజెక్ట్ టైగర్” కార్యక్రమానికి సాటిరాలేదు. పులుల సంరక్షణలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. భారత్‌ చేపట్టిన చర్యలను బంగారు ప్రమాణాలుగా ప్రపంచం భావిస్తోంది.